రేపటి నుంచి శామ్ సంగ్ ‘బ్లాక్ ఫ్రైడే’ సేల్

  • 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహణ
  • అన్ని రకాల శామ్ సంగ్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలు
  • బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్
శామ్ సంగ్ ఎట్టకేలకు బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 28 వరకు డిస్కౌంట్ సేల్ కొనసాగుతుంది. ఈ ఐదు రోజుల్లో శామ్ సంగ్ తన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్ పై డిస్కౌంట్స్ ను ఆఫర్ చేయనుంది. 

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22, ఎస్ 22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ల ధరలు సాధారణ రోజుల్లో రూ.72,999 నుంచి ఆరంభమవుతుంటే.. బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ.60,000 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లు అయిన.. జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫ్లిప్ 3, జెడ్ ఫోల్డ్ 4 ధరలు సాధారణ రోజుల్లో రూ.80,999 నుంచి మొదలవుతుంటే, ఈ సేల్ లో రూ.67,999 నుంచి లభించనున్నాయి. 

ఇక గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్ ధరలు రూ.31,999 నుంచి రూ.42,999 మధ్య ఉంటాయి. పాత ఫోన్లను ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా కొత్త ఫోన్లపై మరింత తగ్గింపు పొందొచ్చు. అలాగే, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. శామ్ సంగ్ షాప్ యాప్ లేదంటే సమీపంలోని ఎలక్ట్రానిక్ స్టోర్లకు వెళ్లి ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.

Samsung
Black Friday Sale
starts
November 24

More Telugu News